జోరు కొనసాగించిన మార్కెట్లు!

by Harish |
జోరు కొనసాగించిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం కూడా భారీ లాభాలను నమోదు చేశాయి. దీంతో సెన్సెక్స్ రెండ్రోజుల్లో 928 పాయింట్లు లాభపడింది. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ ఫైజర్, జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో కలిసి రూపొందిస్తున్న వ్యాక్సిన్ సత్ఫలితాల క్రమంలో దేశీయ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 429.25 పాయింట్లు లాభపడి 35,843 వద్ద ముగియగా, నిఫ్టీ 121.65 పాయింట్ల లాభంతో 10,551 వద్ద ముగిసింది. కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాల సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు బలమొచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఉదయం ప్రారంభం నుంచే మార్కెట్లు జోరు కొనసాగించాయన్నారు. సెన్సెక్స్ ఓ దశలో‌ కరోనాకు ముందున్న 36,000 మార్కును తొలిసారి దాటినప్పటికీ తర్వాత 35,843 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, టైటాన్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, మారుతీ, ఎల్అండ్‌టీ, ఓఎన్‌జీసీ, ఐటీసీ, రిలయన్స్, సన్‌ఫార్మా లాభాల్లో ట్రేడవ్వగా, యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో కదలాడాయి. ముఖ్యంగా ఆటో, ఐటీ రంగాలు 3 శాతం చొప్పున, మెటల్‌, ఫార్మా 1 శాతానికిపైగా లాభపడ్డాయి.

Advertisement

Next Story

Most Viewed