రైతులను కలవడానికి సమయం లేదా? : పవార్

by Shamantha N |
రైతులను కలవడానికి సమయం లేదా? : పవార్
X

ముంబయి: ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సోమవారం నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత శరద్ పవార్ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న వ్యక్తులు రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతుల పట్ల ఎన్‌డీఏ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా మూడు రోజులు ధర్నాకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చింది.

ఈ మేరకు మహారాష్ట్రలోని 21 జిల్లాల నుంచి 500 వాహనాల్లో సుమారు 6 వేల మంది రైతులు ముంబయిలోని ఆజాద్ మైదాన్‌‌కు చేరుకున్నారు. సోమవారం రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు. కానీ, గవర్నర్ అందుబాటులో లేరు. ఆయన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించడానికి నిరాకరించిన రైతు సంఘాల నాయకులు మెట్రో సినిమా వద్ద ధర్నాకు దిగారు. ఆజాద్ మైదాన్‌లో రైతులను ఉద్దేశించి మాట్లాడిన శరద్ పవార్ ఈ విషయాన్ని ఉటంకించారు. ‘గవర్నర్ కలవడానికి మీరు రాజ్‌భవన్‌కు వెళ్లారు. కానీ, ఆయన అందుబాటులో లేరు. గతంలో ఎప్పుడూ ఇలాంటి గవర్నర్‌‌ను మహారాష్ట్ర చూడలేదు. ఆయనకు సినీ నటి కంగనా రనౌత్‌ను కలవడానికి సమయం ఉంది కానీ, రైతుల సమస్యలు వినడానికి లేదు. రాష్ట్రంలో అందుబాటులో ఉండి, రైతులను కలవడం గవర్నర్ నైతిక బాధ్యత’ అని శరద్ పవార్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed