కూలిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రహరీ..

by Shyam |   ( Updated:2020-10-14 03:06:18.0  )
కూలిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రహరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పొటెత్తుతోంది. దాని తీవ్రకు నగరంలో ఇప్పటికే పలువురు గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కార్లు, ద్విచక్రవాహనాలు కూడా వరదలో కొట్టుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ ఏయిర్ పోర్టు ప్రహరీ గోడ కూలిపోయింది.

గొల్లపల్లి వైపు వరద ప్రవాహం వెళుతుండటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఇతరులు ఎవరూ ఏయిర్ పోర్టులోకి అక్రమంగా ప్రవేశించకుండా ఉండేందుకు సీఐఎస్‌ఎఫ్ బలగాలను అధికారులు పహారా కోసం పెట్టారు.

Advertisement

Next Story