మురళీధరన్ బయోపిక్‌పై తమిళుల ఫైర్

by Anukaran |   ( Updated:2020-10-14 02:10:58.0  )
మురళీధరన్ బయోపిక్‌పై తమిళుల ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ను సేతుపతి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం ఇందుకు సంబంధించిన చిన్న యానిమేషన్ స్టోరీ వీడియో క్లిప్పింగ్‌తో పాటు మురళీధరన్‌గా సేతుపతి పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా సేతుపతి ఈ పిక్స్‌లో శ్రీలంక జెండా ధరించడంపై మండిపడుతున్నారు తమిళులు. సింహళ ప్రభుత్వం సృష్టించిన మారణహోమంలో రెండు లక్షలకు మందికి పైగా తమిళులు చనిపోతే.. ఆ దేశ జెండాను నీ హృదయంపై మోసేందుకు షేమ్‌గా ఫీల్ అవ్వడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

ఈ చిత్రాన్ని మా భూమిపై చిత్రీకరించేందుకు అనుమతించబోమని.. ఆడనివ్వమని సవాల్ విసురుతున్న తమిళులు. మారణహోమంతో మరణించిన మన ప్రజల బాధ తెలిసినా, మారణహోమానికి మద్దతునిచ్చే వ్యక్తిగా ఎలా ఉండగలరు? అని ప్రశ్నిస్తున్నారు. ShameOnVijaySethupathi పేరుతో హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అయినా గొప్ప గొప్ప రికార్డులు కలిగిన ప్లేయర్స్ ఇండియాలో చాలా మంది ఉండగా.. మురళీధరన్ బయోపిక్ చేయాల్సిన అవసరం ఉందా అంటున్నారు. శ్రీలంక క్రికెటర్‌గా తమిళులకు వ్యతిరేకంగా సినిమా తీసేందుకు పూనుకున్న సేతుపతి కెరియర్‌ను అంతం చేసేవరకు నిద్రపోయేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా తమిళ ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించిన సినిమాలు చేయడం ఆపితే బాగుంటుందని హెచ్చరించారు.

అయితే ఈ విషయంలో విజయ్ సేతుపతికి సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారు. హాలీవుడ్ గాంధీ సినిమా తెరకెక్కించినప్పుడు.. మనం మురళీధరన్ సినిమా తీస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. ఎప్పుడూ పాస్ట్‌లో బతుకుతూ మూర్ఖులుగా ప్రవర్తించకుండా.. ఒక యాక్టర్‌ను యాక్టర్‌గా చూడాలని, నటనలో జీవించేందుకు శ్రీలంక ఫ్లాగ్ ధరిస్తే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. అయినా మురళీధరన్ శ్రీలంకన్ తమిళ్ అని.. ఆయన పాత్ర ఒక తమిళనటుడు పోషించడంలో తప్పు లేదని అంటున్నారు. కళను కళగా చూడాలి తప్ప.. ఇలాంటి వివాదాలు సృష్టించడం సమంజసం కాదని చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed