వెనుతిరిగి చూడొద్దని.. వెనక మొత్తం చూపిస్తుందిగా

by Shyam |   ( Updated:2021-03-17 22:56:53.0  )
వెనుతిరిగి చూడొద్దని.. వెనక మొత్తం చూపిస్తుందిగా
X

దిశ, వెబ్ డెస్క్:‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది షాలిని పాండే. ‘అర్జున్ రెడ్డి’ ని కంట్రోల్ చేసే ప్రీతి పాత్రలో షాలిని నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. ఈ నటనతోనే తెలుగు కుర్రకారు మదిలో ఎప్పటికి ప్రీతి గానే కొలువుండిపోయింది. ఈ సినిమా తర్వాత అమ్మడు కొన్ని పరాజయాలను ఎదుర్కున్న విషయం వాస్తవమే. ఇక ఈసారి ఎలా అయిన మళ్ళీ విజయ పరంపర మోగించాలనే దృఢ నిశ్చయంతో బొద్దుగా ఉన్న ఈ భామ కాస్త నాజూకుగా తయారై అందాల ఆరబోతకైనా సిద్ధమని తన ఫోటోషూట్లతో హింట్ ఇస్తుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో అబ్బాయిలకు నిద్ర లేకుండా చేస్తుంది.

తాజాగా షాలిని ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఒక పిక్ నెట్టింట హల్చల్ చేస్తుంది. సాగర తీరాన బ్యాక్ లెస్ ఫోజుతో చిరునవ్వులు చిందిస్తూ అభిమానులకు కునుకుపట్టనివ్వని ట్రీట్ ఇచ్చింది.ఈ ఫొటోకు అమ్మడు మంచి క్యాప్షన్ కూడా జతచేసింది. “ఇలాంటి ఫోజులు ఇస్తే తప్ప ఎప్పుడు జీవితంలో వెనక్కి తిరిగి చూడకు” అంటూ జీవిత సత్యం చెప్పింది. ఇక అమ్మడి నడుము అందాలను చూసిన నెటిజన్లు ఫిదా అవ్వకుండా ఉండగలరా? సూపర్.. సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే షాలిని సినీ కెరీర్ కొంచెం స్లో గానే నడుస్తుంది. ప్రస్తుతం అమ్మడు రెండు హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరి ఈ అందాల ఆరబోత చూసైనా టాలీవుడ్ లో మంచి ఛాన్స్ అందుకుంటుందేమో చూడాలి.

Advertisement

Next Story