- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్.. ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు. అయినా సరే, కరోనా ప్రభావంతో బాధపడుతున్నవారిని ఆదుకునేందుకు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. తను చేసే సహాయ కార్యక్రమాలు వీలైనంత ఎక్కువ మందికి చేరాలని కోరుకుంటున్నారు. మరోవైపు విరాళాల సేకరణకు ఏ చిన్న అవకాశం దొరికినా వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే పలు లైవ్ కన్సర్ట్స్, వీడియో చాట్స్‌లో పాల్గొంటున్న షారుఖ్.. లాక్‌డౌన్‌లో తను నేర్చుకున్న జీవిత పాఠాల గురించి చెబుతుండటం విశేషం.
https://www.instagram.com/p/CAOAfvHlbPl/?igshid=1n4pqcbqeytqn
'నిజం చెప్పాలంటే మనం అవసరాలకు మించి జీవిస్తున్నాం.. కొన్నింటిని మనం పట్టించుకోకపోయినా కేవలం మన దగ్గర ఉందని చెప్పుకునేందుకే పెట్టుకుంటాం' అని షారూక్ అంటున్నారు. అసలు మన చుట్టూ కూడా చాలామంది అవసరం లేదు.. మనతో ప్రేమగా మాట్లాడేవారుంటే చాలని తెలిసిందని చెబుతున్నారు. ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి.. మనం ఎన్ని అనవసర అభద్రతాభావాలను కలిగి ఉన్నామో.. వాటి గురించి ఆలోచిస్తూ ఎంత టైమ్ వేస్ట్ చేస్తున్నామో తెలుస్తుందని' సూచిస్తున్నారు. 'చివరగా ఎవరేం చెప్పినా సరే.. ప్రేమ చాలా గొప్పది' అని షారుక్ జీవిత సత్యాల గురించి చెప్పుకొచ్చారు.