- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ రేర్ ఫీట్
దిశ, సినిమా: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా రేర్ ఫీట్ సాధించబోతోంది. వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ‘బుర్జ్ ఖలీఫా’ లోపల షూటింగ్ చేసే ఫస్ట్ ఇండియన్ సినిమా కాబోతోంది. బుర్జ్ ఖలీఫా ముందు ఓ సెట్ ఏర్పాటు చేసి.. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ కాంబినేషన్‌లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమా పాట షూటింగ్ జరగ్గా.. లేటెస్ట్‌గా కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోణ’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. కాగా, బుర్జ్ ఖలీఫా లోపల షూటింగ్ జరుపుకోబోతున్న ఫస్ట్ మూవీ ‘పఠాన్’. హాలీవుడ్ మూవీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజీలో బుర్జ్ ఖలీఫా ఇన్‌సైడ్ విజువల్స్ కనిపించగా.. ‘పఠాన్’లోనూ చూపించబోతున్నారు మేకర్స్.
ఇంటర్నేషనల్ స్టంట్ టీంతో యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తుండగా…హాలీవుడ్ హీరో టామ్ క్రూయిజ్ లాగా షారుఖ్ బుర్జ్ ఖలీఫా టవర్‌పై ఫైట్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వనున్నాడట. ఇందుకోసం ఆల్రెడీ అనుమతి లభించింది. దీంతో పాటు దుబాయిలోని పలు లొకేషన్స్‌లో చేజింగ్ సీన్స్ ప్లాన్ చేశారని సమాచారం. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ‘పఠాన్’ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్. జాన్ అబ్రహం, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారని టాక్. జూన్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకుని..గాంధీ జయంతి లేదా దీపావళికి సినిమా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్.