- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోయా అక్తర్ చేతిలో షారుఖ్ కూతురి ఫ్యూచర్
దిశ, సినిమా: బాలీవుడ్ బాద్‌షా ఫారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ బీటౌన్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ సైతం తన డెబ్యూ మూవీ ఎప్పుడెప్పుడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా సుహానా ఎంట్రీ త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. అయితే స్టార్ కిడ్స్ లాంచింగ్ అనగానే గుర్తొచ్చే పేరు కరణ్ జోహార్. ఈ మేరకు షారుఖ్ కూతురి లాంచింగ్ బాధ్యత కూడా తనే తీసుకుంటాడని భావించినా.. ఆ అవకాశం మరొకరికి దక్కింది. ఫిల్మ్ మేకర్ జోయా అక్తర్ సుహానాను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ డిజైన్ చేసిందనే న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం ఇంటర్నేషనల్ కామిక్ బుక్ ‘ఆర్చీ’ ఇండియన్ అడాప్షన్‌పై జోయా పనిచేస్తున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో సుహానా నటించనుంది. ఈ టీనేజ్ స్టోరీని గ్రూప్ ఆఫ్ యంగ్ యాక్టర్స్‌తో తెరకెక్కించాలనుకుంటున్న జోయా.. షారుఖ్ కూతురిని మెయిన్ లీడ్‌గా ఎంచుకుందని సమాచారం. ఇంతకుముందు పది నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్‌లో కనిపించిన సుహానాకు ఇదే స్ట్రెయిట్ ఫిల్మ్ కానుండగా ఇప్పటికే ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసింది సుహానా.