- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓడినా.. హృదయాలు గెలిచారు !
ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. కానీ అంతర్జాతీయ వేదికలపై పెద్దగా అనుభవం లేకున్నా వారి ప్రదర్శన అందరి హృదయాలను గెలుచుకునేలా చేసింది. హేమాహేమీలు కూడా సాధించని విజయాలను నమోదు చేసి ఔరా అనిపించుకున్నారు.
కాగా, ప్రెజెంటేషన్ సెర్మనీ సమయంలో షఫాలీ వర్మ బోరున విలపించింది. కప్ చేజారడంతో పాటు తాను ఫైనల్స్‌లో ఘోరంగా విఫలమవడం తనని బాధించినట్లుంది. దీంతో కన్నీళ్లు ఆపుకోలేక ఏడవటంతో తనను మిగతా సభ్యులు ఓదార్చారు. కాగా ఈ టోర్నీలో స్టార్‌గా నిలిచిన షఫాలీని ఓదారుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ‘ఒక 16 ఏళ్ల అమ్మాయి సాధించాల్సిన దాని కంటే ఎక్కువే సాధించావ్’ అని ఆమెను పొగుడుతున్నారు. నువ్వు సాధించాల్సింది ఇంకా ఉందంటూ ఓదారుస్తున్నారు.
‘భారత మహిళా జట్టు అందరికీ గర్వకారణం.. ఒక్క ఓటమితో మీ శక్తిసామర్థ్యాలను తక్కువ చేయలేం.. ఇకపై మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం’ అని అభిమానులు సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు.
tags:ICC Women T20, India vs Aus, Shafali Verma, presentation ceremony