ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదు : ఎస్ఎఫ్ఐ

by Shyam |   ( Updated:2020-08-25 08:27:55.0  )
ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదు : ఎస్ఎఫ్ఐ
X

దిశ, సిద్దిపేట: అత్యచార ఘటనకు ఎస్ఎఫ్ఐ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని, సమాజంలో విద్యార్థుల సమస్యలపై నిజాయితీగా పనిచేస్తున్న తమ సంఘం పేరు వాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట నాయకులు దాసరి ప్రశాంత్, అరవింద్ తెలిపారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ… ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిరంతరం సమాజంలో ఉన్న అంతరాలు పోవాలని, మహిళా రక్షణ చట్టాల కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తోందని తెలిపారు. బాధ్యత కలిగిన సంఘంగా విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. అత్యాచారం కేసులో తమ సంఘం పేరు వాడటం మంచి పద్దతి కాదని, తమ ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది వ్యక్తులు అసత్యప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story