కూతురుపై లైంగిక దాడి.. తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష

by Shyam |
కూతురుపై లైంగిక దాడి.. తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, చేవెళ్ల : కన్న కూతురిపై లైంగికదాడి చేసిన కేసులో ఎల్బీనగర్ కోర్టు నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వివరాల ప్రకారం.. షాబాద్ మండలం మన్ మర్రి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురును పొలం వద్ద 2019 అక్టోబర్ 12వ తేదీన రేప్ చేశాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అదే నెల 16వ తేదీన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించగా కోర్టులో వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి నిందితుడికి 20సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పినట్లు షాబాద్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ అశోక్ తెలిపారు.

Advertisement

Next Story