షాకింగ్.. క్షుద్రపూజల పేరిట యువతి నగ్న వీడియో తీసి..

by Anukaran |   ( Updated:2021-04-10 04:47:47.0  )
షాకింగ్.. క్షుద్రపూజల పేరిట యువతి నగ్న వీడియో తీసి..
X

దిశ, వెబ్ డెస్క్ : క్షుద్రపూజల పేరిట ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ మాంత్రికుడు. క్షుద్రపూజల ద్వారా రూ.80 కోట్లు వస్తాయని ఓ మహిళను నమ్మించిన ఓ మాంత్రికుడు.. ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. మహారాష్ట్ర వార్ధ జిల్లా రామ్‌నగర్‌కు చెందిన మహిళకు ఓ కూతురు ఉంది. అయితే, సహ ఉద్యోగి చెప్పడం వల్ల ఓసారి ఆమెను ఓ మాంత్రికుడు వద్దకు తీసుకెళ్లింది ఆ మహిళ.

కోరికలు తీరని ఆత్మను తన కుమార్తె శరీరంలోకి పంపించడం ద్వారా రూ.80 కోట్లు వచ్చేలా చేస్తానని మాంత్రికుడు బాలికతో సహా యువతిని నమ్మించాడు. ఈ సాకుతో ఏడాది పాటు ఆ మాంత్రికుడు.. యువతిపై అత్యాచారం చేశాడు. క్షుద్రపూజలు చేస్తున్న నెపంతో ఆ యువతిని నగ్నంగా వీడియోలు తీసి, ఆమె శరీరంపై నిమ్మకాయలు తిప్పుతూ అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. దీంతో మాంత్రికుడి వేధింపులు తట్టుకోలేక.. ఆ యువతి అక్కడి నుంచి పారిపోయింది.

అనంతరం బాలిక తల్లి.. తన కూతురు కనిపించడంలేదంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత యువతి ఆచూకీని కనుగొన్నారు. పోలీసుల సమక్షంలో బాధితురాలు తనకు జరిగిన వేధింపుల విషయాన్ని వెల్లడించింది. తనను కాపాడాల్సిందిగా వేడుకొంది. దీంతో పోలీసులు యువతి తల్లితో సహా మాంత్రికుడిని అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story