బంధువుల ఇంటికితీసుకువెళ్లి బాలికపై లైంగికదాడి

by Sumithra |
balika-12
X

దిశ, బంజారాహిల్స్‌: ప్రేమిస్తున్నానని నమ్మించి బాలికను లోబర్చుకుని లైంగికదాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లో నివాసం ఉంటున్న బాలిక(17) ఇంటర్‌ చదువుతోంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న భీమ్‌ రాజ్‌ (23) అనే ఆటో డ్రైవర్‌ గత ఏడాది కాలంగా ఆమెతో స్నేహం చేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను తీసుకుని ఇందిరానగర్‌లోని బంధువు ఇంటికితీసుకువెళ్లి లైంగికదాడికిపాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు. కాగా ఇటీవల బాలిక అదోలా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా జరిగిన విషయం బయటపడింది. ఈ మేరకు బాధితురాలి తండ్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు భీమ్‌రాజ్‌ మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story