శృంగారం అంటే భయం.. అర్థం చేసుకోని మావారంటే కోపం!

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-09-30 15:50:40.0  )
శృంగారం అంటే భయం.. అర్థం చేసుకోని మావారంటే కోపం!
X

నాకు వివాహమై మూడు నెలలు అయ్యింది. కలయిక సమయంలో ఇప్పటి దాకా ఎంతో నొప్పిని అనుభవిస్తున్నాను. కారణం ఏమిటి... శృంగారం అంటే భయం - అర్థం చేసుకోని మావారంటే కోపం కలుగుతున్నాయి. ఏం చెయ్యాలి?

హైమన్ ముక్కలు లోపల ఉన్న కలయికలో - స్ట్రోక్స్ లేదా కదలికల్లో సాగబడి నొప్పి కలుగుతుంది. అలాగే ఫోర్ ప్లే చేయకుండా - కొద్దిపాటి లూబ్రికేషన్లో కలయిక చేయబోయినా నొప్పి కలుగుతుంది. వెజైనా చుట్టూ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా నొప్పి కలుగుతుంది. అలాగే బార్సోలిన్ గ్రంథుల వాపు ఉన్న నొప్పి కలుగుతుంది. గైనకాలజిస్టుని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. మీ భర్తకు వివరంగా చెప్పండి. తీవ్రమైన ఇన్ఫెక్షన్, నొప్పి తగ్గేంత వరకూ శృంగారం వద్దని కచ్చితంగా చెప్పండి. ఆగలేకపోతే బాహ్యస్పర్శలతో ఆనందపడండి. అలాగే మానసికంగా శృంగారం పట్ల వ్యతిరేక ధోరణులు, భయం అసహ్యం ఉన్నా వెజైనమస్కు దారి తీసి వెజైన కండరాలు బిగుసుకుపోయి నొప్పి కలిగి కలయిక సాధ్యంకాదు. భయాన్ని పోగొట్టుకొని ఆనందంగా స్వేచ్ఛగా శృంగారంలో పాల్గొనటానికి సెక్స్ థెరపిస్ట్ను కలవండి. కె.వై.జెల్లీ కూడా వాడవచ్చు. ఫోర్ ప్లే ఎక్కువ సార్లు చెయ్యండి.

- డాక్టర్ భారతి. MS

సైకోథెరపిస్ట్ &సెక్సాలజిస్ట్

Read More : శృంగారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. మీరు అస్సలు ఊహించనివి..

👉 మరిన్ని సెక్స్ & సైన్స్ వార్తల కోసం సందర్శించండి

Advertisement

Next Story
null