- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పేరెంట్స్.. సెక్స్ గురించి మీ పిల్లలకు చెప్పండి’
దిశ, వెబ్‌డెస్క్: భారత సమాజంలో ‘సెక్స్’ గురించి బహిరంగ వ్యాఖ్యలు అరుదు.. కానీ, అత్యధికంగా పోర్న్ వ్యూవర్స్ ఉన్నది మనదేశంలోనే అని పలు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా కౌమార, యవ్వన దశలో సెక్స్ మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ సీక్రెట్ విషయాలను ఫ్రెండ్స్‌తో మాత్రమే షేర్ చేసుకుంటారు. చాలా వరకు పర్సనల్ విషయాలను ఇతరులకు షేర్ చేసుకోలేని యువత పోర్న్ సైట్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు.
ముఖ్యంగా పేరెంట్స్ వద్ద మాత్రం సెక్స్ విషయాన్ని అస్సలే బయటపెట్టరు. కౌమార దశ నుంచి పెండ్లీడుకొచ్చిన పురుషులు, స్త్రీలు ఈ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పుకోవాలన్న ఆలోచన కూడా రాదు. కానీ, తల్లిదండ్రులు మాత్రం పిల్లలకు చిన్నతనం నుంచే శృంగార పాఠాలు చెప్పాలంటున్నారు సెక్స్ కోచ్ పల్లవి బర్నవాల్.
తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్‌వ్యూ ఇచ్చిన సెక్స్ కోచ్ పల్లవి బర్నవాల్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. కట్టుబాట్లు విపరీతంగా ఉండే సంప్రదాయ కుటుంబంలో పుట్టడమే తనను సెక్స్ కోచ్ వైపు నడిపాయని వెల్లడించారు. బిహార్‌లో పుట్టి పెరిగిన పల్లవి తన తల్లిదండ్రుల మధ్య ‘సెక్స్’ అనే అంశం వేరు చేసిందని.. తన తల్లి పెండ్లికి ముందు జరిగిన నిజం చెప్పడంతో నాన్న.. అమ్మకు దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. ఫ్యామిలీలో సెక్స్, సాన్నిహిత్యాల గురించి మాట్లాడుకోకపోతే, రిలేషన్‌లు ముక్కలైపోతాయని తాను ఒక నిర్ణయానికి వచ్చినట్టు పల్లవి అభిప్రాయం వ్యక్త పరిచారు.
సెక్స్ గురించి తెలుసుకున్న తర్వాత 25 ఏండ్లకే కన్యత్వాన్ని కోల్పోయానని.. ఆ తర్వాత రెండేండ్లకు వివాహం చేసుకున్నట్టు చెప్పారు పల్లవి బర్నవాల్. ఈ సమయంలో తన వర్జినిటీ గురించి భర్తకు చెప్పొద్దని తన తల్లి చెప్పడం విడ్డూరంగా అనిపించిందన్నారు. ఎట్టకేలకు మొదటిరాత్రి గడిచినా.. ఐదేళ్లు మాత్రమే భర్తతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేశానని చెప్పారు. సహోద్యోగితో మనసు పడడంతోనే తన వివాహ జీవితం పూర్తిగా నాశనం అయిందని అసలు నిజం చెప్పింది పల్లవి. అయినప్పటికీ 32 ఏళ్ల వయస్సులో ‘నా బిడ్డను ఎవరి ఆధారం లేకుండా పెంచుతున్నాను.. నన్ను దిగజారిన మహిళ అని అంటోంది సమాజం.. ఇప్పటికీ వివాహేతర సంబంధాలు సాగిస్తున్నాను.. వయస్సు పైబడిన వారితోనూ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను.. ఇలా ఉండటమే నాకు స్వతంత్రాన్ని ఇచ్చిందని మా అమ్మ కూడా ఒప్పుకుందని పల్లవి ఆనందం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సెక్స్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ కోచ్‌గా శిక్షణ తీసుకొని.. ఇన్‌స్టాగ్రామ్ పేజీని క్రియేట్ చేసి.. చాలా మందికి లైంగిక అనుభవాలను షేర్ చేస్తున్నానని చెబుతోంది ఈ సెక్స్ కోచ్.
ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు సెక్స్, రిలేషన్‌షిప్ గురించి తెలుసుకుంటున్నారని.. కానీ, భారత్‌లో 2018లోనే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ.. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గైడ్‌లైన్స్ తీసుకొచ్చినప్పటికీ.. చాలా రాష్ట్రాల్లో ఈ మార్గదర్శకాలను అమలు చేయలేదని చెప్పారు. దీని కారణంగా దేశంలోని గ్రామాల్లో చాలా మంది అమ్మాయిలకు రుతుస్రావం అంటే తెలియకుండా పోతోందని ఓ జాతీయ మీడియా అధ్యయనంలో తేలిందన్నారు. అందుకే పిల్లల్లో సెక్స్, రిలేషిప్ కోసం తల్లిదండ్రులే వారికి సొంత అనుభవాలను నేర్పాలని సూచిస్తున్నారు. ముందుగా నగ్నం, డేటింగ్, ఎల్‌జీబీటీ, గర్భస్రవాలు, కండోమ్‌లు, వివాహేతర సంబంధాలు, ఆరోగ్యకరమైన రిలేషన్‌షిప్‌ల గురించి పిల్లలకు ముఖ్యంగా చెప్పాలంటోంది పల్లవి బర్నవాల్.