ఏపీలో తీవ్ర విషాదం, నదిలో ఏడుగురు గల్లంతు !

by srinivas |   ( Updated:2020-12-17 07:13:11.0  )
ఏపీలో తీవ్ర విషాదం, నదిలో ఏడుగురు గల్లంతు !
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సిద్దవటం దిగువపేటకు చెందిన చంద్రశేఖర్ వర్థంతి కార్యక్రమాన్ని ఆయన కుమారుడు వెంకట శివ నిర్వహించాడు. గురువారం ఈ కార్యక్రమానికి హాజరైన తిరుపతికి చెందిన 10మంది వెంకట శివ ఫ్రెండ్స్ మధ్యాహనం సమయంలో పెన్నానదిలో ఈతకొట్టేందుకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన 10మందిలో 8మంది నదిలో దిగి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా మునిగిపోయారు. వెంకట శివ ఒక్కడే అతికష్టం మీద ఒడ్డుకు చేరగా మిగతా ఏడుగురు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొన్నారు. గజ ఈతగాళ్లతో కలిసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారిలో జగదీశ్, షన్ను, రాజేశ్, సతీశ్, యశ్వంత్, తరుణ్, సోమశేఖర్‌ ఉన్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకొని కన్నీరు మున్నీరవుతున్నారు.

Advertisement

Next Story