ఏడుగురు క్రీడాకారులకు పద్మ పురస్కారాలు

by  |   ( Updated:2021-01-26 08:33:41.0  )
ఏడుగురు క్రీడాకారులకు పద్మ పురస్కారాలు
X

దిశ, స్పోర్ట్స్ : గణతంత్ర దినోవ్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం సోమవారం పలువురికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. వీటిలో ఏడుగురు క్రీడాకారులకు ‘పద్మశ్రీ’ పురస్కారం దక్కింది. సుధా సింగ్ (స్టీపుల్ ఛేజ్ అథ్లెట్, ఉత్తరప్రదేశ్), మౌమా దాస్ (టేబుల్ టెన్నిస్, పశ్చిమ బెంగాల్), అనిత పాల్‌దురై (బాస్కెట్ బాల్, తమిళనాడు), వీరేందర్ సింగ్ (బదిర రెజ్లర్, హర్యానా), అన్షు జమ్‌సెన్పా (పర్వతాహరోహణం, అరుణాచల్‌ప్రదేశ్) లకు ఈ పురస్కారం దక్కింది.

సుధాసింగ్ 2010 ఆసియా క్రీడలు, 2017 ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. మౌమా దాస్‌ 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం, మహిళల డబుల్స్‌ విభాగంలో రజతం సాధించింది. భారత బాస్కెట్‌బాల్ జట్టుకు ఎనిమిదేళ్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన అనిత పాల్‌దురై.. ఆ క్రీడకు చేసిన సేవకు గాను అవార్డు లభించింది. ఇక వీరేందర్ సింగ్ 2005, 2013, 2017 బదిర ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు. ఇక అన్షు రెండు సార్లు ఎవరెస్టు అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.

Advertisement

Next Story