థర్డ్‌ వేవ్‌కు సిద్ధం.. పిల్లలపై కొవావాక్స్ టీకా ట్రయల్స్

by Shamantha N |   ( Updated:2021-06-17 11:16:03.0  )
covavax 1
X

ముంబై : వచ్చే నెలలో చిన్నారులపై కొవావాక్స్ టీకా ట్రయల్స్ ప్రారంభించడానికి సీరమ్ కసరత్తు చేస్తున్నది. పిల్లలపై ట్రయల్స్‌పై కేంద్ర ప్రభుత్వమూ సుముఖంగా ఉన్నది. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ నోవావాక్స్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఉత్పత్తి కోసం సీరంతో గతేడాదే ఒప్పందం చేసుకుంది. ట్రయల్స్‌నూ ప్రారంభించింది.

ఈ ట్రయల్స్ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్‌లో టీకాను లాంచ్ చేయడానికి సీరం ప్రయత్నాలు చేస్తు్న్నది. ఇదిలా ఉండగా, ఈ టీకాను పిల్లలపైనా ట్రయల్స్ చేయడానికి సీరం నిర్ణయించింది. మనదేశంలో పిల్లలపై ట్రయల్స్ జరిగే నాలుగో టీకాగా కొవావాక్స్ నిలవనుంది.

Advertisement

Next Story

Most Viewed