ఎట్టకేలకు లాభాల్లో మార్కెట్లు!

by Harish |
ఎట్టకేలకు లాభాల్లో మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ఫార్మా కంపెనీ మెడెర్నా ఇంక్‌ తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్‌ తొలి దశ పరీక్షలు విజయవంతమైనట్టు వచ్చిన వార్తలతో దేశీయ మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. అయితే, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు సిద్ధమవడంతో సూచీలు కాసేపు ఊగిసలాడినప్పటికీ.. చివరకు లాభాలతో ముగిసి పర్వాలేదనిపించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 167.19 పాయింట్ల లాభంతో 30,196 వద్ద ముగియగా, నిఫ్టీ 55.85 పాయింట్లు లాభపడి 8,879 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో ఆటో, మీడియా, ఎఫ్ఎమ్‌సీజీ, ఐటీ రంగాల షేర్లు 2 శాతం వరకూ పెరగ్గా, ప్రభుత్వ రంగ బ్యాంకులు 2.6 శాతం నష్టపోయాయి. ఇక, త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన అనంతరం ఎయిర్‌టెల్ ఏకంగా 11 శాతం పుంజుకుంది. సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, ఆల్ట్రాటెక్, ఐటీసీ, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడగా, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఎల్‌టీ, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 2,513 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీ ఫండ్‌లు కూడా రూ. 152 కోట్ల విలువైన షేర్లు విక్రయించాయి.

Advertisement

Next Story

Most Viewed