భారీ లాభాలను సాధించిన మార్కెట్లు

by Anukaran |
భారీ లాభాలను సాధించిన మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ లాభాలను నమోదు చేశాయి. ముఖ్యంగా మెటల్, ఫైనాన్స్ రంగాల నుంచి మద్దతు లభించడంతో సూచీలు అధిక లాభాలను దక్కించుకున్నాయి. సోమవారం నాటి స్వల్ప లాభాలను కొనసాగించిన మార్కెట్లు అంతర్జాతీయంగా తయారీ రంగం పునరుద్ధరణ సాధిస్తున్నదనే సంకేతాలతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అక్టోబర్ నెలలో భారత్ సహా పలు దేశాల్లో ఉత్పత్తి కార్యకలాపాలు జోరందుకున్నాయి. దీంతో ఆసియా మార్కెట్లు సానుకూలంగా ర్యాలీ చేయగా, ఆ ప్రభావంతో దేశీయ మార్కెట్లు అధిక లాభాల్లో ట్రేడయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 503.55 పాయింట్ల లాభంతో 40,261 వద్ద ముగిసింది. నిఫ్టీ 144.35 పాయింట్లు లాభపడి 11,813 వద్ద ముగిసింది.

నిఫ్టీలో బ్యాంకింగ్ రంగం 3 శాతనికి పైగా ర్యాలీ చేయగా, ఫైనాన్స్, ఆటో, మెటల్, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగాల షేర్లు 1 శాతానికి పైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, ఎల్అండ్‌టీ షేర్లు అధిక లాభాల్లో ట్రేడవ్వగా, ఎన్‌టీపీసీ, రిలయన్స్, నెస్లె ఇండియా, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.36 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed