- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాభాల జోరు కొనసాగించిన సూచీలు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాలను సాధించాయి. కీలక రంగాల నుంచి మద్దతు లభించడం, కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మేధో హక్కుల నిబంధనలను తాత్కాలికంగా రద్దు చేయాలని భారత్ చేసిన ప్రతిపాదనకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో మార్కెట్లలో ఉత్సాహం కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో పాటు దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా నియంత్రణకు టీకా సరఫరా మెరుగ్గా ఉందనే సంకాతాల నేపథ్యంలో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. ఆసియా మార్కెట్లలొ మిశ్రమ ధోరణి ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో సూచీలు వారాంతం లాభాలను సాధించగలిగాయని విశ్లేషకులు తెలిపారు.
ప్రధానంగా మెటల్, ఫైనాన్స్, టెలికాం రంగాల షేర్ల కొనుగోళ్లు జోరుగా ఉండటంతో సెన్సెక్స్ విరామం తర్వాత 49 వేల మార్కును దాటింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 256.71 పాయింట్లు ఎగసి 49,206 వద్ద ముగియగా, నిఫ్టీ 98.35 పాయింట్లు లాభపడి 14,823 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 5 శాతం లాభంతో ర్యాలీ చేయగా, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్టీ ఇండెక్స్‌లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, ఓఎన్‌జీసీ, ఆల్ట్రా సిమెంట్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభాలను సాధించగా, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.48 వద్ద ఉంది.