వరుసగా రెండోరోజు లాభాల్లో సూచీలు!

by Harish |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్‌లో లాభాలను సాధించాయి. ఉదయం నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఐటీ, మెటల్ రంగాల్లో షేర్లు సూచీలకు కీలక మద్దతునిచ్చాయి. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో మిడ్ సెషన్‌కు ముందు తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ మార్కెట్లు దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ జూన్ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయనే అంచనాల నేపథ్యంలో ఐటీ రంగం షేర్లు కొనుగోళ్లు జోరును కొనసాగించినట్టు నిపుణులు తెలిపారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 134.32 పాయింట్లు లాభపడి 52,904 వద్ద ముగియగా, నిఫ్టీ 41.60 పాయింట్ల లాభంతో 15,853 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ అధికంగా 3 శాతం పుంజుకోగా, ఫార్మా, మీడియా, మెటల్ రంగాలు బలపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎల్అండ్‌టీ, టాటా స్టీల్, ఐటీసీ షేర్లు లాభాలను సాధించగా, మారుతీ సుజుకి, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా, డా రెడ్డీస్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.54 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed