- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరుసగా రెండోరోజు నష్టాల్లో మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాలను నమోదు చేశాయి. బుధవారం నాడు వరుస పది రోజుల లాభాలకు బ్రేక్ పడగా, గురువారం కూడా డీలాపడి స్వల్ప నష్టాలను చూశాయి. ఉదయం ప్రారంభమైన తర్వాత కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్న మార్కెట్లు మరోసారి జీవిత కాల గరిష్ఠాలను తాకాయి. అయితే, ఆ తర్వాత ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల సూచీలు చివరి గంటలో అమ్మకాల ఒత్తిడికి గురవడంతో స్వల్ప నష్టాలను చూశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 80.74 పాయింట్లు నష్టపోయి 48,093 వద్ద ముగియగా, నిఫ్టీ 8.90 పాయింట్ల నష్టంతో 14,137 వద్ద ముగిసింది.
నిఫ్టీలో మెటల్ రంగం 4 శాతంతో అత్యధిక లాభాలను దక్కించుకోగా, రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ప్రాభుత్వ రంగ బ్యాంక్, ఆటో, మీడియా రంగాలు పుంజుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్అండ్‌టీ, బజాజ ఫైనాన్స్, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో కదలాడగా, టైటాన్, నెస్లె ఇండియా, హిందూస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, ఇటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.41 వద్ద ఉంది.