- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు..
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు రెండు రోజుల లాభాల తర్వాత నీరసించాయి. బుధవారం ఉదయం ప్రారంభం నుంచే ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు మిడ్-సెషన్‌కు ముందే నష్టాలను ఎదుర్కొన్నాయి. దీనికితోడు కీలక కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్టాక్ మార్కెట్లను మరింత వెనక్కి లాగేశాయి. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఈ పరిణామాలకు తోడవడంతో మార్కెట్లు ఇటీవల కొనసాగిస్తున్న గరిష్ట స్థాయిలను నిలబెట్టుకోలేకపోయాయి.
చివరి గంటలో కొంతమేరకు పుంజుకున్న సూచీలు ఇంట్రాడే కనిష్టల నుంచి కోలుకుని ఫ్లాట్‌గా ముగిశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 28.73 పాయింట్లు నష్టపోయి 54,525 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 2.15 పాయింట్లు లాభపడి 16,282 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఫార్మా ఇండెక్స్ అధికంగా 1 శాతానికి పైగా క్షీణించగా, ప్రైవేట్ బ్యాంక్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ రంగాలు ప్రతికూల ధోరణితో డీలాపడ్డాయి. మరోవైపు, మెటల్ ఇండెక్స్ 3 శాతం పుంజుకోగా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాల్లో కొనుగోళ్ల ఆసక్తి కనబడింది.
సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, బజాజ్ ఆటో, సన్‌ఫార్మా, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.41 వద్ద ఉంది.