వరుసగా రెండో రోజూ ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..

by Harish |   ( Updated:2021-06-02 06:20:58.0  )
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు ఫ్లాట్‌గా ముగిశాయి. గత వారం సాధించిన లాభాల దృష్ట్యా మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో మార్కెట్లు మిశ్రమంగా ర్యాలీ చేస్తున్నాయి. బుధవారం ఉదయం ప్రారంభం నుంచే నష్టాలను ఎదుర్కొన్న సూచీలు చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలను తగ్గించుకోగలిగాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్, ఆటో రంగాల్లో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ ఇండెక్స్ తక్కువ నష్టాలను చూడగలిగాయని విశ్లేషకులు తెలిపారు. రోజులో ఎక్కువ భాగం స్టాక్స్ ప్రతికూలంగానే ర్యాలీ చేశాయి. చివరి గంటలో బ్యాంకింగ్ రంగం కోలుకోవడంతో నిఫ్టీ కోలుకుంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 85.40 పాయింట్లు నష్టపోయి 51,849 వద్ద ముగియగా, నిఫ్టీ స్వల్పంగా 1.35 పాయింట్లు లాభపడి 15,576 వద్ద ముగిసింది.

నిఫ్టీలో బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 3 శాతం పుంజుకోగా, ఆటో, మెటల్, రియల్టీ రంగాలు బలపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు అమ్మకాల ఒత్తిడితో డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, రిలయన్స్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి, ఎస్‌బీఐ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఐటీసీ, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, కోటక్ బ్యాంక్, టీసీఎస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.11 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed