నష్టపోయిన సూచీలు.. చివర్లో వెల్లువెత్తిన అమ్మకాలు

by Harish |   ( Updated:2021-07-30 05:53:08.0  )
నష్టపోయిన సూచీలు.. చివర్లో వెల్లువెత్తిన అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఈక్విటీ మార్కెట్లు వారాంతం నష్ఠాలను ఎదుర్కొన్నాయి. శుక్రవారం లాభాలతో మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఎదురవడంతో పాటు దేశీయ కీలక రంగాలు చివర్లో భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మిడ్-సెషన్ సమయంలో స్టాక్ మార్కెట్లు గరిష్ఠాల వద్ద ర్యాలీ చేసినప్పటికీ అనంతరం బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని చవిచూశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 66.23 పాయింట్లు కోల్పోయి 52,586 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 15.40 పాయింట్లు నష్టపోయి 15,763 వద్ద ముగిశాయి.

నిఫ్టీలో ఆటో ఇండెక్స్ పుంజుకోగా, మీడియా, ఐటీ, ఫార్మా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాలు బలపడ్డాయి. బ్యాంకింగ్, పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్స్ రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా అత్యధికంగా 10 శాతానికి పైగా దూసుకెళ్లింది. టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం షేర్లు లాభాలను దక్కించుకోగా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, టైటాన్, ఏషియన్ పెయింట్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.41 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed