- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితకాల గరిష్ఠాలను తాకిన సూచీలు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి జీవిత కాల గరిష్ఠాలను తాకాయి. శుక్రవారం ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు చివరివరకు అదే ధోరణిని కొనసాగించాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్ రంగాల్లో షేర్లు అధిక లాభాలను సాధించడంతో సూచీలు గరిష్ఠాలను చూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఓ దశలో ఏకంగా 341 పాయింట్లు పెరిగి 52,641 వద్ద ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. అయితే అనంతర పరిణామాల్లో ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా కొంత వెనకబడ్డాయి. నిఫ్టీ ఇదివరకటి మాదిరిగానే రికార్డు స్థాయిలో ముగిసింది.
మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 174.29 పాయింట్లు లాభపడి 52,474 వద్ద ముగియగా, నిఫ్టీ 61.60 పాయింట్ల లాభంతో 15,799 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 2.7 శాతం పుంజుకోగా, ఐటీ, ఫార్మా రంగాలు బలపడ్డాయి. రియల్టీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంకు రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో డా రెడ్డీస్, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.07 వద్ద ఉంది.