వరుసగా మార్కెట్లకు నష్టాలు

by Harish |
వరుసగా మార్కెట్లకు నష్టాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) వరుసగా ఐదోరోజూ నష్టాలను నమోదు చేశాయి. భారీ నష్టాలను నమోదు చేస్తున్న మార్కెట్లు బుధవారం కాస్త కోలుకుంటున్నట్టు కనిపించినప్పటికీ చివరికీ మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం ప్రారంభమైన తర్వాత ట్రేడర్ల అండతో 400 పాయింట్ల వరకు ఎగసిన ఇండెక్సులు అనంతరం ఊగిసలాట మధ్య వెనక్కు తగ్గాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. మిడ్‌సెషన్ అనంతరం ఒడిదుడుకులు ఎక్కువై చివర్లో అమ్మకాలు అధికమవడంతో మార్కెట్లు నష్టాలను నమోదు చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 65.66 పాయింట్లు నష్టపోయి 37,668 వద్ద ముగియగా, నిఫ్టీ 21.80 పాయింట్లు కోల్పోయి 11,131 వద్ద ముగిసింది. ప్రైవేట్ బ్యాంకులు, రియల్టీ రంగాలు బలపడగా, నిఫ్టీలో ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, మీడియా రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌ (Sensex Index)లో యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, నెస్లె ఇండియా,టైటాన్, మారుతీ సుజుకి, రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, భారతీ ఎయిర్‌టెల్, టాటాస్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ షేర్లు అధికంగా నష్టపోయాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 73.57 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed