- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లేనప్పటికీ వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం, పలు కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండటం మార్కెట్లకు హుషారునిచ్చాయి. ఉదయం ప్రారంభ సమయంలో తడబడినా తొలి గంట అనంతరం మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా, డ్రాగన్ కంట్రీతో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ మార్కెట్లు పుంజుకున్నాయి. తొలుత మదుపర్లు కొనుగోళ్లకు దిగినప్పటికీ మిడ్ సెషన్ తర్వాత జోరందుకున్నాయి. నిఫ్టీలో మెటల్, బ్యాంకింగ్, మీడియా రంగాల సూచీలు 2శాతానికిపైగా లాభాల్లో ట్రేడయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 700.13 పాయింట్ల లాభంతో 34,208 వద్ద ముగియగా, నిఫ్టీ 210.50 పాయింట్లు లాభపడి 10,091 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఐటీసీ, ఐసీఐసీఐ, రిలయన్స్ షేర్లు అధిక లాభాల్లో ట్రేడవ్వగా, ఓఎన్‌జీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, మారుతీ, బజాజ్ ఆటో షేర్లు నష్టాలను చవిచూశాయి.