కీలక సూచీల జోరు..లాభపడ్డ మార్కెట్లు!

by Harish |
కీలక సూచీల జోరు..లాభపడ్డ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్లు లాభాల బాటలో కదులుతున్నాయి. బుధవారం ఉదయం నుంచే పటిష్టంగా మొదలైన సూచీలు వరుసగా మూడోరోజు లాభాలతో ముగిశాయి. కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలో క్లోజవ్వడం గమనార్హం. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 605.64 పాయింట్లు లాభపడి 32,720 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 172.45 పాయింట్ల లాభంతో 9,553 వద్ద ముగిసింది. అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ప్రధానంగా ఫార్మా, ఆటో, బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్లు మార్కెట్లకు బూస్ట్ ఇచ్చాయి.

ఆటో రంగం 2 శాతం, మెటల్ 4.5 శాతం, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఫైనాన్సియల్స్ చెరో 1.8 శాతం, ఐటీ, రియల్టీ రంగాలు 1.3 శాతం ఎగిశాయి. ఫావిపిరవిర్ కంపెనీ సొంతంగా ఔషధాన్ని అభివృద్ధి చేసినట్టు స్ట్రైడ్స్ ఫార్మా ప్రకటించాక ఈ కంపెనీ షేరు ఏకంగా 20 శాతం లాభపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌సీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడగా, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనిలీవర్, టైటాన్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. ఇక, యూఎస్ డాలరు మారకంతో రూపాయి 52 పైసల లాభంతో రూ. 75.67 వద్ద ఉంది.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed