వరుసగా నాలుగోరోజూ లాభపడ్డ మార్కెట్లు!

by Harish |
వరుసగా నాలుగోరోజూ లాభపడ్డ మార్కెట్లు!
X

దిశ,సెంట్రల్ డెస్క్: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సోమవారం స్వల్పంగా లాభపడిన మార్కెట్లు మంగళవారం భారీగా లాభాలను నమోదు చేశాయి. అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల జోరు కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు రికవరీ దిశగా ఉంటాయనే సంకేతాలతో మదుపర్ల ఉత్సాహంతో వరుసగా నాలుగో రోజు దేశీయ మార్కెట్లు దూకుడును చూపించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మిడ్ సెషన్ తర్వాత మార్కెట్లు బలపడ్డాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 519.11 పాయింట్లు లాభపడి 35,430 వద్ద ముగియగా, నిఫ్టీ 159.80 పాయింట్ల లాభంతో 10,471 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంక్‌ నిఫ్టీ, ఫార్మా, ఐటీ, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, మెటల్ రంగాలు 1 నుంచి 3 శాతం మధ్య లాభపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రాటెక్, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ షేర్లు మత్రమే నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 38 పైసలు బలపడి రూ.75.64గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed