నష్టాలతో ముగిసిన మార్కెట్లు!

by Harish |
నష్టాలతో ముగిసిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలున్నయనే సంకేతాలకు తోడు, ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల మధ్య మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. మరోవైపు వరల్డ్ బ్యాంక్ ఇండియా వృద్ధిరేటును 2.8 శాతంగా ఉండోచ్చనే అంచనాలను విడుదల చేయడం కూడా మార్కెట్లకు రుచించలేదు.

ప్రపంచ మార్కెట్లు సైతం బలహీనంగా ఉండటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనబడుతోంది. ఇవాల్టి నష్టాల్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఫైనాన్సియల్ సూచీలు ప్రభావితం చేశాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడయ్యాయి. ఉదయం నుంచి నష్టాలతోనే కొనసాగిన సూచీలు సాయంత్రానికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1.51 శాతం క్షీణించి 469.60 పాయింట్ల నష్టంతో 30,690 వద్ద క్లోజయింది. నిఫ్టీ 118.05 పాయింట్లు నష్టపోయి 8,993 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 10.27 శాతం నష్టపోగా, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, హీరో మోటోకార్ప్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. ఎల్‌టీ అధిక లభాలను చూడగా, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ షేర్లు లాభాలను ఆర్జించాయి. నిఫ్టీలో ముఖ్యంగా మెటల్, ఫార్మా మినహా అన్ని రంగాలు ప్రతికూలంగా కదలాడాయి. ఫార్మా రంగం అధికంగా 2.77 శాతం పెరిగింది.

Tags : sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed