బ్యాంక్ షేర్ల జోరు..లాభాల్లో మార్కెట్లు!

by Harish |
బ్యాంక్ షేర్ల జోరు..లాభాల్లో మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో ఆసియా మార్కెట్ల ప్రభావంతో నష్టాలను చూసినప్పటికీ లంచ్ టైం తర్వాత తిరిగి లాభాల్లో కదలాడాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల సూచీలు లాభాల్లో ఎగిశాయి. అయితే, లాభాల స్వీకరణ కారణంగా ఫార్మా షేర్లు ఈసారి నష్టాలను చవిచూశాయి. నాలుగో త్రైమాసిక ఫలితాల తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ ఏకంగా 15 శాతం పెరిగింది. మణప్పురం ఫైనాన్స్ సైతం 14 శాతం పెరిగింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 371.44 పాయింట్ల లాభంతో 32,114 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 98.60 పాయింట్లు లాభపడి 9,380 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంకు 300 పాయింట్లు ఎగిసి జోరును పెంచాయి. దీంతో వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇంకా, సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు షేర్లు లాభాల్లో కదలాడగా, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, నెస్లె ఇండియా, హెచ్‌సీఎల్ సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.

Tags : sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed