వారాంతంలో లాభాలు నమోదు చేసిన మార్కెట్లు!

by Harish |   ( Updated:2020-06-05 07:03:25.0  )
వారాంతంలో లాభాలు నమోదు చేసిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస ఆరు రోజుల లాభాలకు గురువారం బ్రేక్ పడగా, శుక్రవారం బ్యాంకింగ్, మెటల్ రంగాల అండతో శుక్రవారం మళ్లీ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా మారిన పరిస్థితులతో మార్కెట్లలో సెంటిమెంట్ బలపడింది. దీంతో మదుపర్లు పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు శుక్రవారం దేశీయ టెలికాం దిగ్గజం జియోలో అబుదాబికి చెందిన ముబదలా కంపెనీ పెట్టుబడులతో మార్కెట్లో సెంటిమెంట్ బలపడింది. ముఖ్యంగా, బ్యాంకింగ్, ఆటో, మెటల్, ఇన్‌ఫ్రా రంగాల షేర్లు పుంజుకోవడంతో మార్కెట్లకు కలిసొచ్చాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 306.54 పాయింట్ల లాభంతో 34,287 వద్ద ముగియగా, నిఫ్టీ 113.05 పాయింట్లు లాభపడి 10,142 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, టాటాస్టీల్ అత్యధిక లాభాల్లో ట్రేడవ్వగా, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. టీసీఎస్, హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, నెస్లె ఇండియా, హెచ్‌సీఎల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.58 గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed