- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారాంతంలో మార్కెట్లకు తప్పని నష్టాలు
దిశ, వెబ్‌డెస్క్: వారాంతంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. బుధవారం నాటి నష్టాల నుంచి కోలుకుని గురువారం భారీ లాభాలను నమోదు చేసిన సూచీలు శుక్రవారం మళ్లీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడటంతో ఉదయం నుంచే మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతిందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 143.36 పాయింట్లు కోల్పోయి 36,594 వద్ద ముగియగా, నిఫ్టీ 45.40 పాయింట్లు నష్టపోయి 10,768 వద్ద ముగిసింది. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల షేర్ల అమ్మకాలతో దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, సన్‌ఫార్మా, హిందూస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, పవర్‌గ్రిడ్ షేర్లు లాభపడగా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.