కరోనా భయంలో మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభం!

by Harish |
కరోనా భయంలో మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభం!
X

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ నెమ్మదిగా అంతర్జాతీయ మార్కెట్‌నూ, దేశీయ మార్కెట్‌నూ ప్రభావితం చేస్తోంది. మొదట్లో పెద్దగా కనబడని ఈ వైరస్ ప్రభావం మెల్లగా అలుముకుంటొంది. ఇప్పటికే, గతంలో వచ్చిన సార్స్‌ను మించి మరణాలు సంభవించడంతో, అంతర్జాతీయంగా ఉత్పత్తి, సరఫరాపై ఒత్తిడి పెరగడంతో దేశీయ మార్కెట్లు ఈ వారం సైతం నష్టాలతోనే మొదలయ్యాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 243.31 పాయిట్ల నష్టంతో 40,896 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 81.85 పాయింట్ల నష్టపోయి 12,016 వద్ద ట్రేడవుతోంది.

బంగారం సైతం స్వల్పంగా ధర పెరిగింది. కరోనా వైరస్ భయంతో ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌లో హిందూస్తాన్ యూనిలివర్, ఐసిఐసిఐ బ్యాంకు, బజాజ్ ఫినాన్స్ షేర్లు మాత్రమే స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. మహీంద్ర అండ్ మహీంద్ర, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ షేర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed