- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొనసాగుతున్న నష్టాలు..40 వేల దిగువకు సెన్సెక్స్!
దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ మార్కెట్లను కరోనా వైరస్ భయాలు వీడలేదు. మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో మార్కెట్లు తడబడుతున్నాయి. తాజాగా, కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలకు పాకితే ప్రపంచ జీడీపీలో ఏకంగా ఒక ట్రిలియన్ డాలర్లు నష్టపోయే ప్రమాదం ఉందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అంచనాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు తడబడుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనబడుతోంది. వరుస నష్టాలతో సూచీలన్నీ కుదేలవుతున్నాయి. బుధవారం సైతం మార్కెట్లు నష్టాలతోనే మొదలయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 40 వేల దిగువకు దిగజారింది.
ప్రస్తుతం సెన్సెక్స్ 299.56 పాయింట్ల నష్టంతో 39,981 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 86.50 పాయింట్లను కోల్పోయి 11,711 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లో ఏషియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎస్‌బీఐ షేర్లు స్వల్పంగా లాభాలతో కొనసాగుతుండగా, మిగిలిన సూచీలన్నీ నష్టాల్లో కదలాడుతున్నాయి. సన్‌ఫార్మా అధికంగా 2.23 శాతం నష్టాన్ని చూస్తుండగా, సుమారు 10 సూచీలకు పైగా 1 శాతం కంటే అధికంగా నష్టపోయాయి. యూఎస్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 71.77 వద్ద ఉంది.