ఆర్‌బీఐ భరోసాతో జోరందుకున్న మార్కెట్లు!

by Harish |
ఆర్‌బీఐ భరోసాతో జోరందుకున్న మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లకు ఆర్‌బీఐ ప్రకటనలు ఊతమిచ్చాయి. ముఖ్యంగా రివర్స్ రెపో రేటు తగ్గించడం, మొండి బాకీల సంబంధించిన నిబంధనలను సడలించడం, వ్యవస్థలోకి నిధులు మళ్లిస్తామని భరోసా ఇవ్వడం వంటి ప్రకటనలతో ఫైనాన్సియం షేర్లు జోరందుకున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియా సమావేశం తర్వాత మార్కెట్లలో జోరు పెరిగింది. మార్కెట్లు ముగిసే సమయానికి 3 శాతం లాభాలతో క్లోజయ్యాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన మార్కెట్లు చివరికి లాభాల్లో ముగిశాయి. ఫార్మా, ఎఫ్ఎమ్‌సీజీ రంగాలు భారీ లాభాలను ఆర్జించగా, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ 7 శాతం, ఆటో రంగం 5 శాతం లాభాలతో ట్రేడయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 986.11 పాయింట్ల లాభంతో 31,588 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 273.95 పాయింట్ల లాభంతో 9,266 వద్ద క్లోజయింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, నెస్లే ఇండియా, హిందూస్తాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో కదలాడాయి. అమెరికా వ్యాపారంపై విప్రో వ్యక్తం చేసిన ఆందోళనల వల్ల ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed