నటి శ్రావణి మృతి కేసులో సంచలనాలు

by Anukaran |   ( Updated:2020-09-11 06:14:04.0  )
నటి శ్రావణి మృతి కేసులో సంచలనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీవీ సీరియల్ నటి శ్రావణి మృతి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తన ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రుల ఫిర్యాదుతో దేవరాజు జైలుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత జైలు నుంచి వచ్చాక కూడా శ్రావణి దేవరాజుతో సన్నిహితంగా ఉన్నట్లు వెల్లడైంది. సరిగ్గా ఆత్మహత్యకు రెండ్రోజుల ముందు ఇరువురు కలిసినట్టు విచారణలో తేలింది.

దేవరాజుతో ప్రేమలో ఉన్న సమయంలో శ్రావణి ఓ సెల్ఫీ వీడియో తీసిందని.. తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడినట్లు చెప్పారు. అవే ఫొటోలు, వీడియోలను చూపిన దేవరాజు.. శ్రావణిని రోడ్డుపైకి లాగుతానని తల్లిదండ్రులను హెచ్చరించాడు. దీంతోశ్రావణి తన సోదరుడు సాయి, బావను వెంటేసుకొని వచ్చి ప్రియుడిని నిలదీసింది. ఇదే వ్యవహారంలో మాటా మాటా పెరగడంతో శ్రావణి వెంటే వచ్చిన కుటుంబీకులు దేవరాజ్ పై దాడిచేశారు.

ఆ తర్వాత తన పై దాడి చేశారని దేవరాజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. తమ కూతురిని వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులు కూడా ఎస్ఆర్ నగర్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దేవరాజును రిమాండ్‌కు తరలించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత విడుదల అయిన దేవరాజుతో శ్రావణి మళ్లీ సన్నిహితంగా ఉంది. సరిగ్గా ఆత్మహత్యకు రెండ్రోజుల ముందు కూడా శ్రావణి, సాయి.. దేవరాజును కలిసి మాట్లాడుతుండగా మరోసారి ఘర్ణణ నెలకొంది. ఆ తర్వాత ఆడియో టేపు మొబైల్‌లో ఉంచి.. శ్రావణి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story