- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వీపర్‌తో నర్సు అఫైర్.. అడ్డొచ్చిన భర్తను 7 ముక్కలు చేసి విసిరేసారు
దిశ, గోదావరిఖని: ప్రియుడి కోసం భర్తను ముక్కలు ముక్కలుగా నరికించి హత్య చేయించింది ఓ భార్య. చివరకు పోలీసులకు చిక్కి పిల్లలను దిక్కులేని వారిని చేసింది. రామగుండం మీ సేవ కేంద్రం ఉద్యోగి కాంపెల్లి శంకర్(35) దారుణ హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితులైన ఎన్టీపీసీకి చెందిన పాయిల రాజు, మృతుని భార్య హేమలతను అరెస్టు చేసినట్టు రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నవంబర్ 25న అదృశ్యమైన కాంపల్లి శంకర్ అదే రోజు దారుణ హత్యకు గురైనట్టు గుర్తించారు. నిందితుడి నుంచి రెండు కత్తులు, పగిలిన బీరు సీసా, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అసలు విషయం ఏంటంటే..
సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ భార్య హేమలత ఎన్టీపీసీలోని ధన్వంతరి హాస్పిటల్‌లో స్టాఫ్ నర్సుగా పనిచేసేది. ఈ సమయంలో అదే ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేసే రాజు అనే యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా భర్తకు తెలియడంతో ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో పలుమార్లు శంకర్-రాజు ఘర్షణలకు దిగారు.
ఇక తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పగ పెంచుకున్న రాజు-హేమలతలు చంపేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో నవంబర్ 25న ఫుల్‌గా మద్యం సేవించాడు రాజు. శంకర్‌కు కాల్ చేసి ఎన్టీపీసీలోని తన ఇంటికి రమ్మని పిలిచాడు. ఇదే సమయంలో శంకర్ కూడా మద్యం మత్తులో ఉన్నాడు. వారిద్దరూ కలిసి మళ్లీ మద్యం తాగుతూ మరోసారి ఘర్షణ పడ్డారు. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన రాజు.. శంకర్ తలపై బీర్ బాటిల్ పగుల గొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత శంకర్ శరీరాన్ని ఏడు ముక్కలు చేశాడు. అనంతరం వివిధ ప్రాంతాలలో శరీర భాగాలను పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టే ప్రియుడు-ప్రియురాలు నటించసాగారు. మిస్సింగ్ అయ్యాడు అంటూ కవరింగ్ ఇచ్చారు.
రామగుండంలో శరీర భాగాలు కలకలం రేపిన నేపథ్యంలో కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శరీర భాగాలను స్వాధీనం చేసుకుని మృతి చెందింది శంకర్‌గా గుర్తించారు. ఇదే క్రమంలో అన్ని కోణల్లో ఆరా తీసి హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధం అని తేల్చారు. నిందితుడు రాజుతో పాటు మృతుని భార్య హేమలతను అరెస్టు చేసినట్లు సీపీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.