రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే పోలీసుకు పాజిటివ్

by vinod kumar |
రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే పోలీసుకు పాజిటివ్
X

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. అక్కడ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న ఓ సీనియర్ పోలీసు అధికారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఏసీపీతో సన్నిహితంగా ఉన్న ఇతర పోలీసు అధికారులను క్వారంటైన్‌ కేంద్రాలకు పంపారు. సుమారు ఆరుగురి పోలీసుల శాంపిళ్లను కరోనా టెస్టుకు పంపించారు. ఏసీపీ కార్యాలయం.. రాష్ట్రపతి భవన్‌లోనే ఉన్నప్పటికీ.. సదరు పోలీసు అధికారి బయటే ఎక్కువగా విధులు నిర్వహించేవారని తెలిసింది. గత నెల రాష్ట్రపతి భవన్‌లో పనిచేస్తున్న ఓ కార్మికురాలి బంధువుకు కరోనా పాజిటివ్ తేలడంతో సుమారు 115 మంది సిబ్బంది క్వార్టర్‌లను అధికారులు సీల్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story