ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత

by vinod kumar |   ( Updated:2021-05-20 21:08:20.0  )
Cinematographer Jayaram
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో కరోనా తీవ్ర విషాదం నింపుతోంది. ఇండస్ట్రీలో విస్తృతంగా వ్యాప్తిచెందుతూ ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను పొట్టనబెట్టుకుంది. తాజాగా.. మరో విషాదం నింపింది. కరోనాతో ప్రముఖ సీనియర్ సినిమాటోగ్రాఫర్ జయరాం కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మలయాళం, తెలుగు సినిమా రంగంలో సినిమాటోగ్రాఫర్‌గా జయరాం ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

తెలుగులో సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకు ఆయన వర్క్ చేశారు. దర్శక దిగ్గజం కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన సినిమాటో గ్రఫీలోనే ‘పెళ్లి సందడి’ చిత్రం రూపొందింది. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి ఇండస్ట్రీలో విషాదం నింపింది.

Advertisement

Next Story