సీనియర్ జర్నలిస్ట్ అమర్నాథ్ మృతి

by Shyam |
సీనియర్ జర్నలిస్ట్ అమర్నాథ్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనాకు మరో పాత్రికేయుడు బలయ్యారు. ప్రముఖ జర్నలిస్టు, ఉద్యమ నేత కె.అమర్నాథ్ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. పది రోజుల క్రితం ఆయన కరోనాతో నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. అమర్నాథ్ మృతి జర్నలిస్ట్ లోకానికి తీరని లోటని పాత్రికేయ సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. జర్నలిస్టుల సమస్యలపై తనవంతు బాధ్యతలను సమర్థవంతంగా పోషించారని, నిరాడంబరంగా జీవించారని, అందరితో ఆత్మీయంగా మెలిగారని కొనియాడారు.

Advertisement

Next Story