- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హ్యాండ్’ ఇచ్చారు.. పదవులకు ఫస్ట్.. ప్రచారానికి లాస్ట్..!
దిశ, తెలంగాణ బ్యూరో : మండలి పోరులో కాంగ్రెస్‌నేతలు ముఖం చాటేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీనియర్లు కనిపించడం లేదు. ఇటీవల టీపీసీసీ చీఫ్మార్పు అంశంపై పోటీపడ్డ నేతలు ఎన్నికల ప్రచారానికి మాత్రం ముఖం చాటేస్తున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ సెగ్మెంట్‌లో రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తున్నా… వారి వెంట సైతం సీనియర్ నాయకులు కనిపించడం లేదు. దీంతో అసలు సమయంలో నాయకులు చేతులెత్తేశారని కాంగ్రెస్శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దీనిపై అభ్యర్థులు సైతం అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, వీహెచ్, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, షబ్బీర్‌అలీ, మధుయాష్కి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలు ఇప్పుడు ప్రచారంలో అభ్యర్థులతో కలిసి రావడం లేదు. దీంతో అభ్యర్థులు ఒంటరిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదట్లో ప్రచారానికి వెళ్లినా… ఆ తర్వాత దూరంగానే ఉంటున్నారు.
ఇటీవల కాలంలో ఎంపీ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరగగానే.. వ్యతిరేక వర్గం తెరపైకి వచ్చింది వీహెచ్, జగ్గారెడ్డి లాంటి నేతలు బహిరంగగానే రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. టీపీసీసీ రేసులో ఉన్న ఇతర నేతలు సైతం రేవంత్‌ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నేతలంతా రేవంత్‌రెడ్డికే పగ్గాలివ్వాలని కోరుతున్నా.. సీనియర్లు అడ్డుపడుతూనే ఉన్నారు. దీంతో టీపీసీసీ అంశం ఇప్పట్లో తేల్చేది లేదంటూ అధిష్టానం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్వచ్చింది. ఈ మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకపవనాలు వీస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్పట్టు సాధించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ అధిపత్యపోరు నేతలను కలువకుండా చేస్తోంది.
వరంగల్ సెగ్మెంట్‌లో రాములు నాయక్, హైదరాబాద్సెగ్మెంట్లో చిన్నారెడ్డి గెలుపుపై ఆశలు పెట్టుకున్నా నేతల వైఖరితో ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు సెగ్మెంట్ల పరిధుల్లో కాంగ్రెస్ సీనియర్లు ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి జానారెడ్డి, ఉత్తమ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉన్నప్పటికీ.. ఉత్తమ్మినహా మిగతా నేతలు ప్రచారానికి హాజరుకావడం లేదు. టీపీసీసీ చీఫ్పీఠం కోసం పోటీపడిన జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డిది సైతం అదే పరిస్థితి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి సంబంధించిన బాధ్యతలన్నీ రేవంత్‌రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క వంటి నేతలతో ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రచారం కోసం రావాలని ఇప్పటికే సీనియర్లను కోరినా వారు రావడం లేదంటూ అభ్యర్థులు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిఠాగూర్కు సమాచారమిచ్చారు. ఉత్తమ్సైతం ఠాగూర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినట్టు పార్టీ నేతలు చెప్తున్నారు.