మీరు అలా చేస్తే.. మేం ఇలా చేస్తం: పోలీస్ కమిషనర్ రవీందర్

by Shyam |
మీరు అలా చేస్తే.. మేం ఇలా చేస్తం: పోలీస్ కమిషనర్ రవీందర్
X

దిశ, వరంగల్: నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ హెచ్చరించారు. బుధవారం సెంట్రల్ డివిజన్ పరిధిలోని ఎల్కతుర్తి సర్కిల్ పోలీసుల అధ్వర్యంలో రైతులు నకిలీ విత్తనాలను గుర్తించాల్సిన అంశాలను వివరిస్తూ రూపొందించిన ఫ్లెక్సీని పోలీస్ కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాల నియంత్రణ కోసం ఎల్కతుర్తి సర్కిల్ పోలీసులు స్పందించిన తీరు అభినందనీయమన్నారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన కల్పించే విధంగా రూపొందించబడిన ఈ ఫ్లెక్సీలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలు, పురుగు మందులను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే రైతులు డయల్ 100 లేదా 9491089257 ఫోన్ నంబర్లకు సమాచాడంతో నకిలీ విత్తనాల అమ్మకదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమములో కాజీపేట ఏసీపీ రవీందర్ కుమార్, ఎల్కతుర్తి సర్కిల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాజ్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి ఎస్.ఐలు ఉమ, సూరి, పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed