శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం సీజ్

by Sumithra |
heavy gold
X

దిశ, రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాయతీ విమానాశ్రమంలో భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. మంగళవారం కువైట్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకున్న ఓ ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేశారు. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా నిందితుడు ప్యాంట్‌కు ప్రత్యేకంగా జేబు ఏర్పాటు చేసుకొని బంగారు చైన్లను జేబులో పెట్టుకొని తరలించడాన్ని కస్టమ్స్ అధికారులు స్కానింగ్‌లో కనుగొన్నారు. దీంతో ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న అధికారులు, రూ.34 లక్షల విలువ గల 700 గ్రాముల 24 క్యారెట్ల బంగారు చైన్లన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికుడిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story