అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

by Shyam |
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
X

దిశ,ఇబ్రహీంపట్నం: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరిని ఎల్బినగర్ ఏస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని ఎల్బినగర్ ఏస్ఓటీ పోలీసులకు సమాచారం అదింది.

దీంతో సొమవారం ఉదయం వారు మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో మకాం వేసి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. బొల్లోరో TS O7 UE 4256 వాహనంలో 16 క్వింటాల రేషన్ బియ్యం, 32 బ్యాగులు లను స్వాధీనం చేసుకున్నారు. అనతరం ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆరుట్ల గ్రామానికి చెందిన మార శంకరయ్య డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి చిన్నగంట శ్రీనివాస్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనతరం ఈ కేసును మంచాల పోలీసు స్టేషన్ కు అప్పగించారు.

Advertisement

Next Story