అసెంబ్లీలో కేసీఆర్ గట్ల చెబితే.. అధికారులేమో గిట్ల జేస్తుండ్రు..

by Shyam |   ( Updated:2021-07-27 06:35:16.0  )
mla seethakka
X

దిశ, మంగపేట : ఇరవై సంవత్సరాలుగా దున్నుకుంటున్న రైతుల పోడు భూములపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడం సరైంది కాదని ఎట్టి పరిస్థితుల్లో పోడుభూములు వదులుకునేదిలేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లా మంగపేట మండలంలోని కొత్తూరు మొట్టలగూడెం గిరిజన రైతులతో కలిసి పోడుభూముల్లో హరితహారం పేరుతో మొక్కలు నాటేందుకు వచ్చిన సీతక్కను ఫారెస్టు అధికారులను అడ్డుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులకు గత ప్రభుత్వాలు ఆర్ఓఎఫ్ఆర్, రెవెన్యూ పట్టాలు ఇచ్చిందని అట్టి భూములు తమవంటూ ఫారెస్టు అధికారులు కోర్టు స్టేకు వెళ్లి మళ్లీ తీర్పు రాకుండానే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాడ్వాయి మండలం కాటాపూర్‌లో కరోనా బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసి మంగపేట మండలానికి వస్తున్న సీతక్క, మండలంలోని కొత్తూరు గ్రామంలో కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించారు.

అయితే బొమ్మయిగూడెం గ్రామములో ఫారెస్ట్ అధికారులు పోడు రైతుల భూముల్లో స్ట్రెంచ్‌లు కొడుతున్నారని తెలిసి రైతులతో కలిసి ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెబుతుంటే.. ఫారెస్టు అధికారులు హరితహరం పేరుతో రైతులపై దాడులు చేస్తున్నారన్నారు. రెవెన్యూ పట్టా ఉన్నా ఫారెస్ట్ అధికారులు ఇష్టానుసారంగా రైతులపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేయడం సరైంది కాదని, పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. పోడు రైతులు ఐక్యంగా పోరాటం చేసేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, సీనియర్ నాయకుడు దామెరా సారయ్య, కారుపోతుల నర్సయ్య గౌడ్, మాసిరెడ్డి వెంకట్ రెడీ, మాజీ బ్లాక్ అధ్యక్షులు ఎండీ ముజాఫర్, సీతక్క యువసేన మండల అధ్యక్షుడు సిద్ధ బత్తుల జగదీశ్, నరేష్, ఆకు పవన్, తోట అశోక్ కుమార్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed