మావోయిస్టుల వార్తలు చూసి… అన్నల అవతారం

by Aamani |   ( Updated:2020-08-10 11:51:20.0  )
మావోయిస్టుల వార్తలు చూసి… అన్నల అవతారం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు నకిలీ నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల వివరాల ప్రకారం… కెరమెరి మండలానికి చెందిన కోట్నాక్ బొజ్జి రావు , క్కొట్నాక్ రఘునాథ్, భీమ్ రావు అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. కెరమెరి మండలంలోని జోడేఘాట్ గ్రామంలో పత్రికల్లో వచ్చిన మావోయిస్టుల వార్తలను చూసి నక్సలైట్ల అవతారం ఎత్తారు. ఈ ముగ్గురు కలిసి జోడేఘాట్ నుంచి బయలుదేరి మండలంలోని హట్టి గ్రామ జంక్షన్ వద్ద ఎర్ర జెండాలు పట్టుకుని ఆ దారిన వెళ్తున్న ఒక మోటార్ సైకిల్ ను అడ్డుకున్నారు.

మేము అన్నలం… అని చెప్పి ఆ వ్యక్తి నుంచి మోటార్ సైకిల్ లాక్కున్నారు. ముగ్గురు కలిసి మోటార్ సైకిల్‌పై ఆసిఫాబాద్‌కు వెళ్లారు. అక్కడినుంచి గోలేటి, తిర్యాని ప్రాంతాలకు వెళ్లి అక్కడ కాంట్రాక్టర్లు, వ్యాపారులను నక్సలైట్ల పేరుతో బెదిరించారు. ఈ సమాచారం పోలీసులకు అందడంతో వారిపై నిఘా పెట్టారు. సోమవారం సాయంత్రం ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట రోడ్‌లో వీరు వస్తున్న సమాచారం మేరకు మాటువేసి పట్టుకున్నారు. వీరి నుంచి మోటార్ సైకిల్, సెల్ ఫోన్లు, ఎర్రజెండాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్టు చేసినట్టు జిల్లా ఇన్చార్జీ ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. నకిలీ నక్సలైట్ల సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed