- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షహీన్‌బాగ్‌లో 144 సెక్షన్
న్యూఢిల్లీ : ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో 144 సెక్షన్ విధించారు. నార్త్ ఢిల్లీలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సీఆర్‌పీసీలోని 144 సెక్షన్ విధించినట్టు అధికారులు తెలిపారు. అలాగే, పెద్దమొత్తంలో పోలీసులు మోహరించారు. ఈ రోజు ర్యాలీ చేపట్టనున్నట్టు షహీన్‌బాగ్ ఆందోళనకారులు ప్రకటించడంతో ఈ భద్రతపెరిగినట్టు తెలుస్తున్నది. అలాగే, రైట్ వింగ్ గ్రూప్ హిందూ సేన కూడా ఈ రోజు (మార్చి 1) షహీన్‌బాగ్‌కు ర్యాలీ చేపడతామని, షహీన్‌బాగ్ నిరసన ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పిలుపునిచ్చింది. కానీ, తర్వాత ఆ ర్యాలీని హిందూ సేన రద్దు చేసుకున్నది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఉద్రిక్తతలు ఏర్పడకుండా ఉండేందుకే 144 సెక్షన్ విధించినట్టు చెబుతున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ మహిళలు, చిన్నారులు రెండు నెలలుకు అధికంగా షహీన్‌బాగ్‌లో నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనతో తమ ప్రయాణాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నదని, నిరసన ప్రాంతాన్ని ఆందోళనకారులు ఖాళీ చేసి ఇంకో స్థలాన్ని కేటాయించుకోవాల్సిందిగా సూచనలివ్వాలన్న పిటిషన్ విచారిస్తూ.. సుప్రీంకోర్టు మధ్యవర్తులను నియమించుకున్న విషయం తెలిసిందే.